ఏలూరు: జిల్లా జీలుగుమిల్లి శివార్లలో శనివారం కూల్ డ్రింకుల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. టీ తాగేందుకు రోడ్డు పక్కన లారీని నిలిపిన డ్రైవర్, తిరిగి స్టార్ట్ చేసే సమయంలో వెనక్కి కదలడంతో ఈ ప్రమాదం జరిగింంని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.