TPT: ఓజిలి(మం) జోస్యులవారికండ్రిగ వద్ద స్వర్ణముఖి నది నుంచి అనుమతులు లేకుండా ఇసుకను ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ వందల ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తూ లక్షల రూపాయల అక్రమ సంపాదన జరుగుతోందని చెబుతున్నారు. ప్రతిరోజూ భారీగా ఇసుక రవాణా జరుగుతున్న అధికారులు చర్యలు తీసుకోవాడం లేదని వారు అంటున్నారు.