ELR: దెందులూరు ప్రజల దాహార్తిని తీర్చటం కోసం రూ. 250 కోట్లతో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో బృహత్తర ప్రణాళిక రూపుదిద్దుకోనుంది. శనివారం పెదవేగ మండల క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 18న జరగనున్న సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి, నిధులు మంజూరుకు కృషి చేనున్నట్లు పేర్కొన్నారు.