ASR: అరకులోయలో కమర్షియల్ గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ వ్యాన్ వస్తున్నప్పటికీ కమర్షియల్ సిలిండర్లు అందక హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు మూతపడుతున్నాయి. ఇళ్లకు వినియోగించే గ్యాస్ కూడా పూర్తిగా అందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు మూడు రోజులు మాత్రమే గ్యాస్ నిల్వ ఉందని రెస్టారెంట్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.