TPT: శ్రీ సిటీ డీఎస్పీ బీవీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మదనపాలెంలో శనివారం కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 102 ఇళ్లలో సుమారు 300 మందిని, 32 వాహనాలను తనిఖీ చేశారు. ప్రజలకు గంజాయి, రోడ్డు భద్రత, మహిళలపై నేరాలు, సైబర్ క్రైమ్లపై అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.