»Minister Ktr Slams Revanth Reddy 3 Hours Power Comments
Revanth Reddyపై కేటీఆర్ ఫైర్.. 3 గంటల కరెంట్ చాలా, కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత అంటూ
వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎందుకు 3 గంటలు చాలు అని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపింది. రేవంత్ కామెంట్లను మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి ముక్తకంఠంతో ఖండించారు.
revanth reddy sawal to brs minister on 24 hours current on agriculture
Revanth Reddy: ఉచిత విద్యుత్‌పై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేసింది. బీఆర్ఎస్ సర్కార్ రైతులకు 24 గంటల త్రి ఫేజ్ కరెంట్ ఇస్తోంది. ఇదే విషయాన్ని అధికార పార్టీ చెప్పుకుంటుడగా.. 24 గంటల ఉచిత విద్యుత్ అక్కర్లేదు అని రేవంత్ (Revanth Reddy) అన్నారు. రోజుకు 3 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని కామెంట్ చేయగా.. బీఆర్ఎస్ నుంచి అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇబ్బందికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది.
రేవంత్ ఏమన్నారంటే..?
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం మంది రైతులకు మూడు ఎకరాల భూమి మాత్రమే ఉందని రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఆ మూడు ఎకరాలను తడిపేందుకు 24 గంటల ఉచిత అవసరం లేదన్నారు. 3 గంటలు ఇస్తే సరిపోతుందని చెప్పారు. విద్యుత్ సంస్థల నుంచి వచ్చే కమీషన్ల కక్కుర్తితో సీఎం కేసీఆర్ ఉచిత్ విద్యుత్ నిర్ణయం తీసుకున్నారని రేవంత్ ఆరోపించారు. అమెరికా పెన్సిల్వేనియాలో జరుగుతున్న తానా మహాసభల్లో రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాల్గొని హాట్ కామెంట్స్ చేశారు.
భగ్గుమన్న బీఆర్ఎస్
రేవంత్ కామెంట్లపై బీఆర్ఎస్ భగ్గుమంది. రేవంత్ (Revanth Reddy) ఆరోపణలకు నిరసనగా రేపటినుంచి ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr) పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో నిరసనలు చేపట్టాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకం అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రేవంత్ మాటలతో ఇదీ మరోసారి బయటపడిందని మండిపడ్డారు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తే ఎందుకు మీ ఏడుపు అని ఫైరయ్యారు. పెట్టుబడిదారులపై ఉండే ప్రేమ..? లక్షల కోట్లు తీసుకొని ఎగ్గొట్టే వారికి ఉండే ప్రేమ.. రైతులపై ఉండదని అడిగారు. తమ పార్టీతోపాటు రైతులకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఆ పార్టీకి ప్రజలు కర్రుకాల్చి వాత పెడతారని చెప్పారు.
ఉచిత విద్యుత్ ఇస్తాం: కోమటిరెడ్డి
రేవంత్ (Revanth Reddy) కామెంట్లు సొంత పార్టీ నేతలను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేతలు ఖండిస్తున్నారు. పార్టీకి ఇబ్బంది కలిగించేలా ఉన్నాయని అంటున్నారు. రేవంత్ ఏ సందర్భంలో ఇలా కామెంట్స్ చేశారో తనకు తెలియదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వడం ఖాయం అని తేల్చిచెప్పారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నేతలు తలో మాట మాట్లాడుతున్నారు.