NLR: బుచ్చి మండలం ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షుడు విప్పగుంట విజయభాస్కర్ రెడ్డిని వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ మేనేజర్ కల్లూరు విజయకుమార్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. పార్టీలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందున పార్టీ క్రమశిక్షణ చర్యలో భాగంగా సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.