»Revanth Reddy Will Make Seethakka Cm If Necessary In Telangana
Revanth Reddy: అవసరమైతే సీతక్కను సీఎం చేస్తాం!
తానా సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని ఎన్నారైలు సీఎం పదవి వేరే వాళ్లకు ఇవ్వారా అంటూ ప్రశ్నించారు. ఆ క్రమంలో సీతక్కకు కనీసం ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఎన్నారైలు కోరారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం వంటి వాటి విషయంలో కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ రెండింటినీ పూర్తి చేయడమే కాంగ్రెస్ విధానమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని ఎన్నారైలు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. దళితులు, గిరిజనులు ముఖ్యమంత్రి కాగలరా? తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తే కనీసం ఉప ముఖ్యమంత్రి పదవి అయినా సీతక్క(Seethakka)కు ఇస్తారా అని ప్రశ్నించారు.
దీనిపై రేవంత్ స్పందిస్తూ.. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్(congress) సంప్రదాయం కాదన్నారు. అవసరమైతే సీతక్క కూడా ముఖ్యమంత్రి కావచ్చని ఆయన అన్నారు. ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపన ఉందని, రానున్న ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అవసరమైన సహాయ, సహకారాలు అందించాలని కోరారు. పార్టీని, తనను విడివిడిగా చూడటం సరికాదని, తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అని ప్రకటించారు.