SRCL: ప్రజా పాలన – ప్రగతి నివేదికలో భాగంగా గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 3రోజుల పాటు అంతర్గత నాణ్యత అకాడమిక్ ఆడిట్ నిర్వహించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి. విజయలక్ష్మి ఆధ్వర్యంలో డా. ఎం. ప్రభాకర్, డా. వై. ఆంజనేయులు విభాగాల రికార్డులను పరిశీలించి సూచనలు అందించారు. అకాడమిక్, రీసెర్చ్, ఔట్రీచ్ కార్యకలాపాలను ఆధారాలతో నమోదు చేసి ఐక్యూ ఏసీకి సమర్పించాం అన్నారు.