NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శనివారం కోవూరు పట్టణంలో పర్యటించనున్నారు. అనంతరం పట్టణం పరిధిలోని “1వ, 2వ వార్డుల సందర్శన” కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.