నల్గొండ పట్టణ శివారులోని ఆర్జాలబావి గ్రామానికి చెందిన ట్రాక్టర్ మెకానిక్ బొల్లెంపల్లి మధు (24) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఈ నెల 8న నకిరేకల్‌కు వెళ్తుండగా తిప్పర్తి మండలంలోని అనిశెట్టిదుప్పలపల్లి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.