టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఫీల్డింగ్ ప్రదర్శనపై మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇతర జట్లతో పోలిస్తే టీమిండియా క్యాచింగ్‌లో వెనకబడి ఉందనేది ‘బహిరంగ రహస్యమే’ అని ఆమె అభిప్రాయపడింది. టీమిండియా ఫీల్డింగ్‌లో ఇంకా మెరుగుపడాలని చెప్పింది. అలాగే, భారత జట్టు విజేతగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది.