»They Are Spewing Poison On Us Etala Rajender Sensational Comments On Kcr
Etala Rajendar: మా మీద కావాలనే విషం చిమ్ముతున్నారు.. ఈటల రాజేందర్
బీజేపీ పార్టీమీద ఎన్ని విషప్రచారాలు చేసిన ప్రజల మద్దతు బీజేపీకే ఉంటుందన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. వరంగల్ కు ప్రధాని మోడీ వస్తున్న సందర్బంగా బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలుకాలని కోరారు.
They are spewing poison on us. Etala Rajender sensational comments on KCR
తమపై, తమ పార్టీపై కొందరు వ్యక్తులు మీడియా సంస్థలు కావాలనే విషం చిమ్ముతున్నాయని హుజురాబాద్ బీజేపీ(BJP) ఎమ్మెల్యే ఈటల రాజేందర్(MLA Etala Rajendar) ఆరోపించారు. ఇటీవల ఈటలను బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. జులై 8వ తేదీన బీజేపీ నేతృత్వంలో జరగున్న విజయసంకల్ప సభ ఏర్పాట్లను ఈటల గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ శ్రేణుల్లో, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి ప్రధాని మోడీ(PM Narendra Modi) వస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల ఎన్నో ఏళ్ల కల అయిన వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూమిపూజ చేస్తారని చెప్పుకొచ్చారు.
బీజేపీకి వరంగల్(Warangal) బలమైన కేంద్రంగా ఎదుగుతోందని ఈ సమయంలో మొదటి సారి ప్రధాని మంత్రి ఈ ప్రాంతానికి వస్తున్నందున పెద్ద ఎత్తున కార్యకర్తలు ఘనస్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. బీజేపీ శ్రేణులు మొత్తం ప్రధాని మంత్రి విజయం కోసం పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. కొందరు బీజేపీ పై విషం కక్కే ప్రయత్నం, కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని పరోక్షంగా బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశించి ఆరోపించారు. రాష్ట్ర అధికార, ప్రతిపక్ష పార్టీల్లా కాకుండా తాము తక్కువ మాట్లాడి, ఎక్కువ పని చేస్తామని ఈటల చెప్పుకొచ్చారు. తెలంగాణ గడ్డ మీద 2019 నుంచి బీజేపీ విజయ పరంపర కొనసాగుతోందని తెలిపారు. అందులో భాగంగానే దుబ్బాక, హుజురాబాద్, గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, టీచర్ ఎమ్మెల్సీల ఫలితాలు సాక్షాలు అని చెప్పారు.
ఇక ఉమ్మడి నల్గొండ మునుగోడులో జరిగిన ఉప ఎన్నికల్లో నైతిక విజయం బీజేపీదే అని చెప్పుకొచ్చారు. కేసిఆర్ కుటుంబ పాలనను అంతమొందించడానికి రాజకీయ మేదావివర్గం అంతాా బీజేపీ గూటిక రావాలని, చట్టం నుంచి ఎవరూ తప్పించుకునే ప్రసక్తే లేదన్నారు. గత పదేళ్లుగా ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఎవరికి ఓటు వేయాలో వారికి బాగా తెలుసన్నారు. ఇక ప్రజల కష్టాలు తీర్చే సత్తా కేవలం బీజేపీ పార్టీకి మాత్రమే ఉందని.. ఈ విషయంలో ప్రజలు కూడా స్పష్టతతో ఉన్నారని చెప్పుకొచ్చారు.