»Actress Ranjitha As Prime Minister Of Kailasa Country
Nityananda: కైలాస దేశ ప్రధానిగా నటి రంజిత!
వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. తమ దేశం అయిన కైలాస దేశ ప్రధానిగా నటి రంజితను నియమించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రకటన సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
ఇండియా నుంచి వివాదాస్పద స్వామి నిత్యానంద(Nityananda) పరారైన సంగతి తెలిసిందే. భారత్ నుంచి వెళ్లిపోయి ఆయన మరో దేశాన్ని సృష్టించుకున్నాడు. ఓ దీవిని తాను ఏలుతున్నట్లు ప్రకటించుకున్నారు. ఆ దీవికి కైలాస దేశ (Kailasa Country) అనే పేరును గతంలోనే ప్రకటించారు. తాజాగా ఆయన ప్రియ శిష్యురాలైన మాజీ నటి రంజిత(Actress Ranjita)ను ఆ దేశానికి ప్రదానిని చేశారు. దానికి సంబంధించిన ప్రకటన గురించి ఓ తమిళ పత్రిక కథనాన్ని ప్రచురించింది. దీంతో మరోసారి నిత్యానంద స్వామి వార్తల్లో నిలిచారు.
నిత్యానంద వెబ్సైట్లోనూ కైలాస దేశ ప్రధాని (Kailasa Country PM) గురించి ప్రకటన చేయడం కలకలం రేపుతోంది. వెబ్సైట్లో రంజిత(Actress Ranjita) ఫోటో కింద నిత్యానందమయి స్వామి అనే పేరు ఉంది. దానికి దిగువనే మరో నోట్ కూడా ఉంది. హిందువుల కోసమే ఏర్పాటైన కైలాస దేశ ప్రధానిగా ఆమెను కీర్తిస్తూ వివరణ ఉంది.
ఈ మధ్యనే ఐక్యరాజ్య సమితి సమావేశంలో కూడా కైలాస దేశం (Kailasa Country) తరపున ప్రతినిధులు హాజరయ్యారు. మహిళా రాయబారులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నటి రంజిత(Actress Ranjita) కూడా కైలాస దేశ ప్రధానిగా త్వరలోనే ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.