E.G: చాగల్లు మండలం సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించి పలు సూచనలు ఇచ్చారు. అలాగే చాగల్లు మండల పంచాయతీ కార్యదర్శులతో సమావేశం అయ్యారు. అనంతరం మండలంలో సర్పంచ్లను సన్మానించారు.