WGL: నర్సంపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో శుక్రవారం మున్సిపల్ ఛైర్పర్సన్ పెండం శ్రీలక్ష్మీ-రామానంద్, స్థానిక కౌన్సిలర్ శ్రీధర్తో కలిసి పర్యటించారు. వార్డులోని మట్టి రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్య వ్యవస్థను పరిశీలించారు. క్రమం తప్పకుండా చెత్త సేకరణ, పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.