VKB: బషీరాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ పంపిణీ చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ.. ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయం పేద కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.