ATP: ఉరవకొండ పట్టణంలోని మసీదుల నిర్వహణకు మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులు ఆర్థిక సాయం అందజేశారు. ఏటా ఆనవాయితీగా మసీదుల పరిశుభ్రత, నిర్వహణ కోసం ఒక్కో మసీదుకు రూ.15 వేలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది కొత్తగా ఏర్పడిన మసీదుతో కలిపి మొత్తం 8 మసీదులకు రూ.1.20 లక్షలు అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు.