These are the movies that are going to be released this Friday...
Friday Release: ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈ వారం కూడా థియేటర్లో చాలా సినిమాలే(Friday Movie Release) సందడి చేయబోతున్నాయి. జులై 7న విడుదలై సినిమాల్లో అందరిలో కొంచెం ఎక్కువ ఆసక్తి ఉన్న సినిమా ‘రంగబలి'(Rangabali). యంగ్ ట్యాలెంటెడ్ హీరో నాగశౌర్య(Nagashourya) నటిస్తున్న ఈ సినిమాకు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో నాగశౌర్యకు జోడిగా యుక్తి తరేజా నటించింది.
‘మత్తు వదలరా’ మూవీతో హీరోగా పరిచయం అయిన సింహా కోడూరి వినుత్నమైన స్టోరీతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ‘భాగ్ సాలే’ సినిమాతో జులై 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా ప్రణీత్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నాడు. అలాగే నేహా సోలంకి హీరోయిన్ గా నటించింది. సీనియర్ హీరో జగపతి బాబు లీడ్ క్యారెక్టర్ లో నటిస్తున్న ‘రుద్రంగి’ మూవీ కూడా జులై 7 నే విడుదల అవుతుంది. ఈ సినిమాపై కూడా ప్రేక్షకులకు మంచి అంచనాలే ఉన్నాయి.
వీటితో పాటు ‘ఓ సాథియా’ అనే మరో చిన్న సినిమా కూడా అదే రోజున థియేటర్లో సందడి చేయనుంది. అలాగే డిఫరెంట్ కథతో ‘సర్కిల్’, మరో వైవిధ్యమైన కథతో ‘7:11’ అనే సినిమా కూడా జులై 7న థియేటర్ లోకి వస్తున్నాయి. మరి వీటిన్నింటిలో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.