NRPT: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముస్తాపేట్, దేశాయిపల్లి ప్రభుత్వ పాఠశాలల్లోని 50 మంది విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. బీఆర్పీ డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి సహకారంతో సర్పంచులు లాలప్ప, సరస్వతి చేతుల మీదుగా వీటిని అందజేశారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.