నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాలకు స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రలో భాగంగా ట్రై సైకిళ్లు, చెత్త బుట్టలు మంజూరయ్యాయి. టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వీటిని శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి రోజు ప్రతి గ్రామంలో పొడి, తడి చెత్త సేకరించి స్వచ్ఛ గ్రామంగా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.