VZM: గజపతినగరం పోస్టల్ ఇన్స్పెక్టర్ బి. ఉపేంద్ర శుక్రవారం ‘ఎక్స్లెన్స్ అవార్డు’ అందుకున్నారు. జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో, పొదుపు పథకాలు, బీమా విభాగాల్లో కనబరిచిన ఉత్తమ ప్రతిభకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. ఏపీ పోస్టల్ సర్కిల్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ సంతోష్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.