PPM: ఈనెల 16 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ తమ నివాసం నుండి పరీక్ష కేంద్రానికి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు పార్వతీపురం డిపో ప్రబంధకుడు లక్ష్మణరావు శుక్రవారం తెలిపారు. హల్ టికెట్ చూపించి బస్సులలో ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. ఈ సదుపాయం పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సులలో చెల్లుబాటు అవుతుందన్నారు.