SRD: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లాకలెక్టర్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు రూ. 26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.