SKLM: ఆమదాలవలస మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం నుంచి ఏప్రిల్ 14 వరకు పశువులకు గాలి కుంటు వ్యాధి నిరోధక ఉచిత టీకాలు వేయనున్నట్లు పశు వైద్యాధికారి నారాయణరావు ఆదివారం ప్రకటనలో తెలిపారు. నాలుగు నెలలు దాటిన దూడలు నుంచి అన్ని పశువులకు ఈ టీకాలు వేయించాలని రైతులకు సూచించారు. రైతు భరోసా కేంద్రాలు, పశు వైద్యశాలల్లో టీకాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.