JGL: మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కానింగ్ సెంటర్లను ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసం హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. మెట్పల్లిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాలు పెరగడంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఎమ్మెల్యే తెలిపారు.