Covid19: గురించి షాకింగ్ న్యూస్..ఇది చైనా రెడీ చేసిన ఆయుధమే!
చైనా(china)లోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ఒక పరిశోధకుడు చావో షావో కరోనావైరస్(corona virus) గురించి షాకింగ్ న్యూస్ చెప్పాడు. కోవిడ్ చైనా చేత "బయో ఆయుధం(bioweapon)" గా రూపొందించబడిందని వ్యాఖ్యానించారు.
కోవిడ్-19(covid 19)తో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. లక్షల కుటుంబాలను ఛిద్రం చేసిన ఈ వైరస్ కారణంగా జనజీవనం పిట్టల్లా చనిపోయారు. ప్రపంచమంతా వణికిపోయింది. దీంతో సంపన్న దేశాలు సైతం దివాళా తీసే స్థితికి చేరుకున్నాయి. ఇంతకు మించి ఇంకా కోలుకోని కుటుంబాలు కోటికిపైగా ఉన్నాయి. అయితే ఇప్పుడు కోవిడ్ -19(covid19) గురించి ఓ ఆశ్యర్యకరమైన విషయాన్ని చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన పరిశోధకుడు చావో షావో(Shao Shao) వెల్లడించారు. ఈ వ్యాధి వైరస్ ప్రమాదం కాదని, ఆయుధం(bioweapon) అని పేర్కొన్నారు. కోవిడ్-19 వ్యాధి కాదని, చైనా ఉద్దేశపూర్వకంగా ప్రజలకు సోకేందుకు తయారు చేసిన బయోవెపన్(bioweapon) అని అన్నారు. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌లోని పరిశోధకుడు చావోషావో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కరోనా వైరస్‌ను బయోలాజికల్ ఆయుధంగా ఉపయోగించుకునేందుకు చైనా మార్పులు చేసిందని ఆయన వెల్లడించారు.
ఇంటర్నేషనల్ ప్రెస్ అసోసియేషన్ సభ్యురాలు జెన్నిఫర్ జెంగ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చావోషావో మరిన్ని ముఖ్యమైన విషయాలు(information) చెప్పారు. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(wuhan institute virology) ల్యాబ్‌లో ఒక సీనియర్ అధికారి తన సహోద్యోగులకు మొత్తం నాలుగు రకాల వైరస్‌లను ఇచ్చారు. ఏది వేగంగా వ్యాపిస్తుందో కనుగొనమని వారిని ఆదేశించినట్లు చావోషావో చెప్పారు. అదేవిధంగా… 2019లో వుహాన్‌లో జరిగిన వరల్డ్‌క్లాస్ మిలిటరీ గేమ్స్‌లో తన సహచరులు చాలా మంది అదృశ్యమయ్యారని ఆయన వివరించారు. వారందరికీ ఏమైంది అని ప్రశ్నించగా హోటళ్ల పరిశుభ్రతను పరిశీలించేందుకు వారిని పంపినట్లు తెలిసింది. పరిశుభ్రతను గుర్తించేందుకు వైరాలజిస్టుల అవసరం లేదన్న ఆయన..అథ్లెట్లు ఉన్న చోట వైరస్ వ్యాప్తి చెందేందుకు పంపినట్లు తెలిసిందని ఆయన వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు కోవిడ్-19 మానవ నిర్మిత వైరస్ అని చైనా(china)లోని వుహాన్‌లోని ల్యాబ్‌లో పనిచేసిన అమెరికాకు చెందిన శాస్త్రవేత్త ఆండ్రూ హఫ్ ఇప్పటికే వ్యాఖ్యానించారు. 2002లో సార్స్ వైరస్ వ్యాప్తి చెందిన తర్వాత చైనాలో వుహాన్ ల్యాబ్ స్థాపించబడింది. ఇందులో వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ వంటి సంస్థలు ఉన్నాయి. ఇక్కడికి కొంత దూరంలో ఉన్న సీఫుడ్ మార్కెట్ వైరస్‌కు కేంద్రంగా భావిస్తున్నారు.