ELR: యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ప్రభావం ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయంపై పడింది. స్వామివారి అన్న ప్రసాదాలు, ప్రసాదాల తయారీకి రోజుకు 30 నుంచి 40 గ్యాస్ సిలిండర్లు ఉపయోగిస్తారు. ప్రస్తుతం గ్యాస్ కొరత ఏర్పడటంతో దేవాలయ అధికారులు గ్యాస్ స్థానంలో కట్టెలను వాడేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటునట్లు తెలిపారు.