JGL: రాయికల్ ప్రెస్‌క్లబ్ భవనానికి స్థలం కేటాయించాలని కోరుతూ మున్సిపల్ ఛైర్మన్ కటకం రవీందర్, కమిషనర్ కీర్తి నాగరాజులకు ప్రెస్ క్లబ్ జేఏసీ సభ్యులు నిన్న వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ పరిధిలో ఉన్న ఖాళీ స్థలంలో 3 గుంటలకు తగ్గకుండా ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణం కోసం భూమిని కేటాయించాలని కోరారు. వైసెఛైర్మన్ తురగ సౌజన్య, ప్రెస్‌క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.