KDP: విజయవాడలోని లోక్ భవన్లో రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీరన్ను గురువారం సాయంత్రం వైవీయూ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ కలసి ఆహ్వానం పత్రం అందజేసి స్నాతకోత్సవానికి హాజరు కావాలని కోరారు. ఈ సందర్భంగా మొక్కను అందజేసే స్వాగతం పలికారు. వైవీయూ 11, 12, 13, 14వ స్నాతకోత్సవం నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.