KNR: జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో ఆత్మ ఆధ్వర్యంలో రైతులతో శాస్త్రవేత్తలు నిన్న చర్చా గోష్ఠి నిర్వహించారు. నూతన వంగడాలు, ఆయిల్ పామ్ సాగు, ఉద్యానవన పంటలు, పంటల్లో వచ్చే కీటకాలు తెగుళ్ల నివారణపై అవగాహన కల్పించారు. రైతుల సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ పీడీ చత్రునాయక్, హుజూరాబాద్ ఏడీఏ జీ. సునీత పాల్గొన్నారు.