TPT: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులో తీసుకున్నట్లు శ్రీకాళహస్తి DSP నరసింహమూర్తి, టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు నిన్న పట్టణంలోని చెన్నై రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వెనుక ఖాళీ స్థలంలో దాడులు నిర్వహించి రాజా, దుర్గాప్రసాద్, వర్షిత్‌ను అరెస్ట్ చేశామన్నారు.