ఎన్నో వివాదాల మధ్య భారీ అంచనాలతో జూన్ 16 రిలీజ్ అయింది ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాకు.. డే వన్ నుంచి మిక్స్డ్ స్టార్ట్ అయింది. అయినా ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్‌తో భారీ వసూళ్లను అందుకుంది. ప్రస్తుతం 500 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.
ప్రభాస్(Prabhas) శ్రీరాముడిగా, కృతి సనన్(Kritisanan) సీతగా నటించిన ఆదిపురుష్ సినిమా(Adipurush Movie)కు.. ఫస్ట్ షో నుంచి డివైడ్ టాక్ వచ్చింది. అయినా మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమాకు 140 కోట్ల ఓపెనింగ్స్ అంటే మామూలు విషయం కాదు. ఇది చాలదా పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి. మూడు రోజుల్లోనే 340 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆదిపురుష్. కానీ ఆ తర్వాత ఆదిపురుష్ కలెక్షన్లు భారీగా డ్రాప్ అయ్యాయి. రోజుకి 15 నుంచి 20 కోట్లు మాత్రమే రాబట్టింది. మొత్తంగా ఫస్ట్ వీక్‌లో 400 కోట్లకు పైగా రాబట్టింది.
ఇక తాజాగా పది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 450 కోట్లు వసూలు చేసిందని ప్రకటించారు మేకర్స్. దీంతో 500 కోట్ల మైలు రాయికి చేరువవుతోంది ఆదిపురుష్(Adipurush Movie). ఖచ్చితంగా త్వరలోనే ఆదిపురుష్ 500 కోట్ల మార్కును టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఎందుకంటే.. తెలుగుతో పాటు నార్త్‌లోను ఆదిపురుష్ థియేటర్ ఆక్యుపెన్సీ బాగుందని అంటున్నారు. ఆదిపురుష్ హిందీ వెర్షన్ 10 రోజుల్లో 140 కోట్ల వరకు వసూలు చేసిందని.. ఇప్పటికే అక్కడ లాభాల బాట పట్టిందని చెబుతున్నారు.
ఇటు తెలుగులో 100 కోట్ల షేర్ వసూలు చేసిందని అంటున్నారు. దీంతో నాలుగోసారి తెలుగులో 100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన హీరోగా నిలిచాడు ప్రభాస్(Prabhas). ఇక ఆదిపురుష్(Adipurush Movie) 500 కోట్ల రాబడితే.. ప్రభాస్ ఖాతాలో ఈ మార్క్ అందుకున్న మూడో చిత్రంగా ఆదిపురుష్ నిలవబోతోంది. బాహుబలి1, బాహుబలి 2 తర్వాత 500 కోట్ల వరకు వెళ్లలేకపోయాడు ప్రభాస్. సాహో 400 కోట్లు, రాధే శ్యామ్ 200 కోట్ల దగ్గరే ఆగిపోయాయి. మరి ఆదిపురుష్ 500 కోట్లు రాబట్టి.. ప్రభాస్ కెరీర్లో మూడో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందేమో చూడాలి.