WGL: కాంగ్రెస్ తెలంగాణ మహిళా అధ్యక్షురాలిగా నియమితులైన వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ ఖమ్మం జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కార్పొరేటర్ గుండేటి నరేందర్, సీనియర్ నాయకులు నల్గొండ రమేష్, తోట హరీష్ తదితరులు పాల్గొన్నారు.