అన్నమయ్య: బి. కొత్తకోట మండలం గట్టు గ్రామానికి చెందిన విజయ్ (26) అనే యువకుడు కుటుంబ కలహాల కారణంగా గురువారం రాత్రి వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులకు ఈ ఘటనపై సమాచారం సేకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.