BPT: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్థులకు కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని జిల్లా DEO శ్రీనివాస్ ఇవాళ తెలిపారు. పరీక్ష కేంద్రాలను తెలుసుకునేందుకు విద్యార్థులు ఇబ్బంది పడకుండా హాల్‌టికెట్లపై (QR) కోడ్‌ను అందిస్తున్నామన్నారు. దీని ద్వారా పరీక్ష కేంద్రాన్ని సులువుగా తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.