TPT: గ్యాస్ కొరత కారణంగా శ్రీకాళహస్తి ఆలయంలో ప్రసాదాల తయారీ నిలిపివేశారని కొందరు ప్రచారం చేశారు. దీనిపై దేవస్థానం అధికారులు స్పందించారు. ఎలాంటి అంతరాయం లేకుండా యథావిధిగా ఆలయంలో ప్రసాదాల తయారీ కొనసాగుతోందని తెలిపారు. భక్తులు అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. భక్తులకు ఎప్పటిలాగే ఎలాంటి కొరత లేకుండా ప్రసాదాలు అందజేస్తున్నామన్నారు.