నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఈనెల 17న ఉదయం 11 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ బీ.శేషన్న తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పట్టణ అభివృద్ధి, పారిశుధ్యం, మౌలిక వసతుల మెరుగుదల, పన్నుల వసూళ్లు, ప్రజా సమస్యలు, తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు వెల్లడించారు.