HYD: కాచిగూడ రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ పోలీసులు నిన్న ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హర్యానా, ఢిల్లీ నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.54 వేల విలువైన 21 మధ్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాచిగూడ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్సైలు ధన్రాజ్, భవాని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.