KMM: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం తిరుమలాయపాలెం మండలంలో పర్యటించనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్ దయాకర్ రెడ్డి తెలిపారు. మండలంలోని బీరోలులో శ్రీరామలింగేశ్వర ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరవుతారన్నారు. అనంతరం దమ్మాయిగూడెం గ్రామంలో జరిగే అభివృద్ధి పనులకు మంత్రి హాజరవుతారని పేర్కొన్నారు.