KMR: ప్రమాదవశాత్తు పెంకుటిల్లు దగ్ధమైన ఘటన సదాశివనగర్ మండలం తిర్మన్ పల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సున్నపు రాజుకు చెందిన ఇంట్లో గురువారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఇంట్లో ఉన్న ఓ వృద్ధురాలు, మరొక వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.