RR: చేవెళ్ల పరిధి గొల్లగూడలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలూర్ పశువైద్యాధికారి డా.దేవేందర్ రెడ్డి పశువులకు వ్యాధి నివారణ టీకాలు వేశారు. వారు మాట్లాడుతూ.. పశువులలో ఉత్పాదక శక్తి, పునరుత్పత్తి శక్తి సామర్థ్యం పెరగడానికి ఏడాదికి 2 సార్లు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలన్నారు.