MDCL: పేద కుటుంబాల ఆడపడుచుల వివాహాలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం అల్వాల్ మండల కార్యాలయం వద్ద తహసీల్దార్ రాములు, మాజీ కార్పొరేటర్లు శాంతి, శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్, BRS నేతలతో కలిసి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.