WNP: జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో గురువారం అధికారులతో ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అలాగే ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.