ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ వరుస పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఆర్సీ15 చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో.. భారీ బడ్జెట్‌తో, భారీ స్కేల్లో ఈ సినిమా రూపొందుతుంది. శంకర్ మార్క్‌లో బిగ్గెస్ట్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు.. తండ్రి కొడుగుగా కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానాతో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు చరణ్. ఉప్పెన తర్వాత ఎన్టీఆర్ కోసం చాలా రోజులు వెయిట్ చేశాడు బుచ్చిబాబు. అయితే తారక్ మాత్రం అతన్ని రామ్ చరణ్ దగ్గరికి పంపించాడు. చరణ్‌కు బుచ్చిబాబు చెప్పిన లైన్ నచ్చడంతో.. వెంటనే అనౌన్స్ చేసేశాడు. అతి త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈలోపే మరో కొత్త సినిమాకు చరణ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. కన్నడలో ‘మఫ్టీ’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన డైరెక్టర్ నర్తన్‌తో.. చాలా రోజులుగా చరణ్ ట్రావెల్ అవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. కానీ క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే నర్తన్ ఒక లైన్ చెప్పగా.. చరణ్‌కు బాగా నచ్చిందట.. దాంతో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొదలైనట్లుగా తెలుస్తోంది. త్వరలోనే బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అవుతుందని అంటున్నారు. స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.