KNRL: కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని ఐదు నియోజకవర్గాలను కలిపి ఆదోని కేంద్రంగా జిల్లా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్ష ఇవాళ 117వ రోజు కొనసాగుతోంది. వందకు పైగా రైళ్లు నడిచే ముఖ్య రైల్వే స్టేషన్ ఉన్న పట్టణంగా ఆదోని పరిపాలన సౌలభ్యానికి అనుకూలమని నేతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అధికంగా జీఎస్టీ చెల్లించే పట్టణాల్లో ఆదోని ముందంజలో ఉందని పేర్కొన్నారు.