UPSC సివిల్స్ ఇంటర్వ్యూలలో రిజర్డ్వ్ కేటగిరీ అభ్యర్థులకు తక్కువ మార్కులు వేస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మెయిన్స్‌లో టాపర్లుగా ఉన్నా, ఇంటర్వ్యూలో అన్యాయం జరుగుతోందని కొందరు ఆరోపిస్తున్నారు. దీనికి నిదర్శనంగా ఒక అభ్యర్థికి 275కి కేవలం 60 మార్కులే వచ్చిన వైనాన్ని ఉదాహరిస్తున్నారు. బోర్డు మాత్రం ప్రతిభ ఆధారంగానే మార్కులు వేస్తామంది.