జగిత్యాల పట్టణంలో వితంతు, ఆసరా పెన్షన్లను రూ. 4,016కు పెంచాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు జిల్లా అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అయితే భర్తను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వితంతువుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు.