MHBD: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా కొత్తగూడ మండలంలో సందడి నెలకొంది. ఓటాయి ZPHSలో ఆవరణలో గురువారం ఉత్సాహంగా ‘క్లీన్ అండ్ గ్రీన్’ డ్రైవ్‌ను నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పిచ్చిమొక్కలను తొలగించి, చెత్తాచెదారాన్ని శుభ్రం చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.