సత్యసాయి: స్వతంత్ర భారతదేశంలో దళితులు శ్మశాన వాటికల కోసం పోరాడాల్సి రావడం అత్యంత సిగ్గుచేటని జేఏసీ నాయకుడు సాకే హరి ఆవేదన వ్యక్తం చేశారు. మడకశిరలో నిర్వహించిన జీపుజాత కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దళిత వాడలు సమస్యల నిలయాలుగా మారాయన్నారు. కనీసం మౌళిక వసతులు కల్పించలేని దుస్థితిలో పాలకులు ఉన్నారని విమర్శించారు.